Site icon NTV Telugu

Telangana Govt: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ధర్నా.. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: సీఎం రేవంత్

Rr

Rr

Telangana Govt: దేశరాజధానిలో బీసి రిజర్వేషన్ల అంశం హీటెక్కుతోంది. ఏకంగా బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ధర్నాకు దిగుతోంది. జంతర్ మంతర్ లో జరిగే ధర్నాను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్ చేయనున్నారు. మరోపక్క ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన ధర్నాలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు చేశారు. రాష్ట్రంలోని బీసీలకు రాజకీయంగా, విద్య ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్ల కోసం వీటిని రూపొందించింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్స్ ను గవర్నర్ ద్వారా రాష్ట్రపతి కి పంపించారు. వాస్తవానికి గవర్నర్ కు బిల్లు పంపి 3 నెలలు దాటింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించలేదు పోనీ తిప్పి కూడా పంపలేదు.. దాంతో కావాలని కేంద్రం బీసి రిజర్వేషన్ల బిల్లును ఆపుతుందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది.

Read Also: US Pakistan 1971 Alliance: 1971లో పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరా.. అమెరికా తీరును ఎండగట్టిన భారత సైన్యం

అయితే, దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ బడుగుబలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎవరెంత మంది ఉంటే వాళ్లకు అంత రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అయితే, కేంద్రంలో కాంగ్రెస్, ఇండియా కూటమిలు అధికారంలోకి రాలేదు.. కానీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం కార్యాచరణను అమలు చేసి ఫైనల్ గా బిల్లును తీసుకొచ్చింది. తెలంగాణలో మొట్టమొదట కుల గణన చేశారు.. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిపుణుల కమిటీనొ కూడా వేశారు. ఇక, అన్ని రకాలు పారదర్శకంగా సర్వే నిర్వహించి బీసీల కోసం రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లును తీసుకు వస్తే కేంద్రం ఆపిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు పేర్కొన్నారు.

Read Also: AP Crime: నవవధువు ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్‌ లెటర్‌..!

ఇక, బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలకు ఢీల్లిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లు కోసం అందరూ పోరాటం చెయ్యాలని కోరారు. అదే రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కాగా, మొత్తానికి రేపు (ఆగస్టు 6న) ఉదయం జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతోంది తెలంగాణ ప్రభుత్వం.

Exit mobile version