Site icon NTV Telugu

సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు.. ప్రభుత్వం అనుమతి

Theaters

Theaters

కరోనా మహమ్మారి విజృంభణతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి… ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి… ఇదే, సమయంలో.. సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, మల్టీప్లెక్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లలో మాత్రం యాథావిధిగా నో పార్కింగ్‌ ఫీజు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ సర్కార్. కాగా, గతంలో.. సినిమా థియేటర్లలో ఎలాంటి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

Exit mobile version