NTV Telugu Site icon

Telangana Govt: పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు

Padma Awords In Telangana Govt

Padma Awords In Telangana Govt

Telangana Govt: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు.

చిరంజీవి మాట్లాడుతూ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డులు ఇవ్వలేదని, అది కొంచెం బాధగా ఉందని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో గద్దర్ పేరుతో ఆ అవార్డ్ ఇస్తాము అని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలన్నారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ వచ్చినందుకు అంత ఉస్తాహం లేదన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే ప్రథమం అన్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు. నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు అవుతోందన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వటం సంతోషమన్నారు. తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వాళ్ళలో వెంకయ్య నాయుడు ఒకరని తెలిపారు. వెంకయ్య నాయుడు వాగ్ధాటికి నేను పెద్ద అభిమానిని అన్నారు.

రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు తగవు…ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయన్నారు. వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లకు తిప్పికొట్టే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. కళను గుర్తించి అవార్డులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలన్నారు. పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల పేర్లను ముందుగా ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోడీదే అన్నారు. సామాజిక సేవ చేసే భాధ్యత ఆర్టిస్ట్ లు స్వయంగా రావాలన్నారు. నా అభిమానులు నాకోసం ప్రాణాలు కాదు – రక్తం ఇవ్వాలన్నారు. నేను అవార్డుల కోసం ఎదురు చూడను, అవార్డులు రావాలని కోరుకోనని తెలిపారు. ఈ అవార్డులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలన్నారు.

Read also: TDP-Janasena Alliance: ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్!

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తి వెంకయ్య నాయుడుకు అవార్డ్ రావడం సంతోషమన్నారు. చిన్నప్పటి నుంచి నాకు అభిమాన నటుడు చిరంజీవికి అవార్డ్ రావడం… ఆ సన్మాన సభలో నేను ఉండడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సినిమా అవార్డులు గద్దర్ పేరుతో ఇస్తామనడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలుగు వాళ్ళకు పద్మా అవార్డులు పొందడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమన్నారు. వెంకయ్య నాయుడు విద్యార్థి దశలోనే రాజకీయ పరిణితి చెందారని తెలిపారు. ప్రతిపక్షంలో బలం తక్కువగా ఉన్నా ఎలా ప్రభుత్వాన్ని ప్రశించాలో వెంకయ్య నాయుడును చూస్తే చాలన్నారు. దుర్బాషలు మాట్లాడకుండా రాజకీయాలు ఎలా చేయాలో వెంకయ్య నాయుడు చూసి నేర్చుకోవాలన్నారు. స్వయంకృషి తో సినిమా ఇండస్ట్రీలో తారా స్థాయికి చేరిన గొప్ప హీరో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిరంజీవితో అసెంబ్లీలో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పద్మ విభూషణ్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అవార్డును స్వీకరిస్తున్నానని అన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరిపినందుకు రేవంత్ రెడ్డికి అభినందనలని తెలిపారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింతగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నా అన్నారు. తెలుగు కళామతల్లికి మూడో కన్ను మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అసభ్యత, అశ్లీలత, హింసకు తావు ఇవ్వకుండా నటించడం కష్టమైన పనే అన్నారు. జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల ఉంటే ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలిపారు. రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ లోనే ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. జనాలను రెచ్చగొట్టే నాయకులకు ప్రజలకు సరైన బుద్ధి చెప్పాలని తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. రాజకీయాల్లో ట్రిపుల్ – C నడుస్తోందని.. క్యాస్ట్, కమ్యూనిటీ, క్రిమినాల్టి నడుస్తోందని అన్నారు.

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌ !

Show comments