NTV Telugu Site icon

Telangana: ఈనెల 17న ప్రభుత్వ కార్యాలయాలే కాదు, విద్యాసంస్థలు పూర్తిగా బంద్..!

School Band

School Band

Telangana: ఈనెల 17న ప్రభుత్వ కార్యాలయాలే కాదు, విద్యాసంస్థలు పూర్తిగా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. శ్రీరాముడి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం శ్రీరామనవమికి సెలవు ప్రకటించింది. కాగా.. అధికారిక క్యాలెండర్ ప్రకారం, ప్రభుత్వం ఏప్రిల్ 17 (బుధవారం) సెలవు దినంగా ప్రకటించింది. భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నాయకత్వం వహిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా పోస్ట్ చేసి ప్రకటించిన విషయం తెలిసిందే.. హైదరాబాద్ ధూల్ పేట నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్రకు రాజాసింగ్ నాయకత్వం వహిస్తారు.

తాజాగా రాజాసింగ్ రాముని శోభయాత్ర కోసం సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ధూల్ పేటలోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం నుంచి భారీ ఊరేగింపును విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సభను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యాసంస్థలు కూడా పూర్తిగా బంద్ కానున్నాయి.

Read also: Israel-Iran Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత కారణంగా చమురు సంక్షోభం మొదలవుతుందా?

మరోవైపు శ్రీరామ నవమి శోభాయాత్రను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. కానీ రాజాసింగ్ యాత్ర సందర్భంగా ఆ మార్గాల్లో పోలీసులు అప్రమత్తం కానున్నారు. కానీ ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకోనున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం రాముడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడని వారి నమ్మకం కాబట్టి.. దేశం మొత్తం శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటుంది.

దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన జన్మస్థలానికి తిరిగి రావడంతో అయోధ్యలో జరగనున్న ఉత్సవాలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 50 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుని శ్రీరామ జన్మభూమి మందిరంలో శ్రీరాముని దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో అయోధ్య ట్రస్టు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు
Kishan Reddy: ఒక వసూళ్ల రాజ్యం పోయి.. ఇంకో వసూలు రాజ్యం వచ్చింది..