NTV Telugu Site icon

Ramoji Rao: నేడు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

Ramoji Rao

Ramoji Rao

Ramoji Rao: నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Read also: Modi Oath ceremony: అర్థరాత్రి వరకు అమిత్ షా, నడ్డా మేధోమథనం.. వరుగా కాబోయే మంత్రులకు ఫోన్స్

శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీ అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు ఈ నెల 5న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నానక్ రాంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. రామోజీరావు మృతికి సంతాపంగా ఆది, సోమవారాలను ఏపీ ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. అలాగే రామోజీ మృతికి నివాళిగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాత మండలి నిర్ణయించింది.

Read also: Modi Oath ceremony: అర్థరాత్రి వరకు అమిత్ షా, నడ్డా మేధోమథనం.. వరుగా కాబోయే మంత్రులకు ఫోన్స్

రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో జరగనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఎల్‌బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి పరిశీలించారు. రామోజీరావు అంత్యక్రియలకు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

Read also: Game Changer : అదిరిపోయే స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్న శంకర్.. మాస్ బీట్స్ సిద్ధం అవుతున్న తమన్..?

రామోజీరావు అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్స్ సిటీ ప్రతినిధులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం చంద్రబాబు, చిరంజీవి, పవన్‌లయన్‌, లోకేష్‌, రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం తదితర ప్రముఖులు రామోజీరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ్‌లను ఏపీ ప్రభుత్వం పంపుతోంది.