తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యింది.. జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నల కోసం నూతన బీమా పథకాన్ని ప్రారంభించనుంది.. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు మంత్రి కేటీఆర్.. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయనున్నామని వెల్లడించారు.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా.. సంబంధిత వ్యక్తి నామినీకి రూ.5 లక్షలు అందచేస్తామన్నారు. పది రోజుల్లో ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని ప్రకటించారు..
Read Also: Savitramma Gari Abbayi: హీరో ఓవరాక్షన్.. చెంప చెల్లు మనిపించిన.. వీడియో వైరల్..
జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నల కోసం ఈనెల 7వ తేదీన నేతన్న భీమా పథకం ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్.. రైతు బీమా మదిరే నేతన్నకు ఈ బీమా పథకం వర్తింపజేయనున్నారు.. దీంతో రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికుకు లబ్ధి చేకూరనుంది.. 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడిగా ప్రకటించింది ప్రభుత్వం.. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల బీమా పరిహారం వారి కుటుంబానికి అందించనుంది సర్కార్.. ఈ పథకం కోసం చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్న బీమా కోసం ఎల్‌ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ కేటాయించిందని.. ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.