Funeral of Krishna Raja: అధికార లాంఛనాలతో.. నేడు కృష్ణంరాజు అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Government Will do Krishnam Raju Funeral Rites: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణం రాజు కన్నుమూశారు. ఆయన పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. నిన్న (ఆదివారం) జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వచ్చిన పలువురు ఆయన కుటంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు పోస్టు కోవిడ్ సమస్యలతో గుండె పోటు రావడంతో నిన్న ఉదయం కన్నుమూశారు. ఇవాళ కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో జరుగనున్తానాయి. ఇంటినుండి ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివదేహం బయలుదేరుతుందని, మధ్యాహ్నం 1గంటలకు కృష్ణంరాజు పార్థివదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. అడ్డంగా పట్టుకున్న అన్న ఏం చేశాడో తెలుసా?
Also Read
రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్‌గా పేరొందారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. అయితే చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. హైదరాబాద్ లో నిన్న తెల్లవారుజామున కన్నుమూశారు కృష్ణంరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు తెలుగు సినీరంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు కృష్ణంరాజు.
Gyanvapi Mosque Case: వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో నేడు కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
-
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
Ravi Teja : సెంటిమెంట్స్‌ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
-
Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!