AC Helmet: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎండ నుంచి రక్షణ కోసం ఏసీ హెల్మెట్‌లను అందించాలని నిర్ణయించింది. ఇటీవల వాటిని ప్రయోగాత్మకంగా కొందరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఇచ్చారు. మిగిలిన ట్రాఫిక్ కానిస్టేబుళ్ల పనితీరు, కానిస్టేబుళ్లకు ఉపయోగపడే అంశాలను పరిశీలించిన తర్వాత అందరికీ ఇస్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్ల కోసం తెలంగాణ పోలీస్ శాఖ తాజాగా ఈ ఏసీ హెల్మెట్ ను సిద్ధం చేసింది. వారం రోజుల క్రితం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఎల్‌టీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కొంతమంది ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్‌లు ఇచ్చారు. ప్రస్తుతం వారి పనితీరుపై విచారణ జరుగుతోంది.
Read also: Fake ice cream: మళ్లీ కల్తీ ఐస్ క్రీం కలకలం.. లైట్ తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం
త్వరలోనే వీటిని అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఏసీ హెల్మెట్‌ను అరగంట పాటు చార్జింగ్ చేస్తే మూడు గంటల పాటు పనిచేస్తుంది. ఈ AC హెల్మెట్ బ్యాటరీ ఆధారంగా పనిచేసేలా అభివృద్ధి చేయబడింది. ఈ హెల్మెట్ మూడు గుంటల నుంచి గాలి వచ్చేలా రూపొందించబడింది. ముఖం మీద, హెల్మెట్ లోపల మూడు వైపుల నుండి చల్లని గాలి వీస్తుంది. ఈ హెల్మెట్‌లు ఎండ ప్రభావం నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయని, చల్లటి గాలిని అందిస్తాయని చెబుతున్నారు. ఇది చల్లని వాతావరణంలో పని చేస్తుందని చెప్పారు. ఈ ఏసీ హెల్మెట్ ట్రాఫిక్ కానిస్టేబుళ్లను వడదెబ్బ, వేడిమి నుంచి కాపాడుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని అందించాలని పోలీస్ శాఖ తాజాగా నిర్ణయించింది. త్వరలో అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ హెల్మెట్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు త్వరలో రోడ్లపై కనిపించనున్నారు.
Read also: Harish Rao: మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన.. పట్టణాల్లో 500 బస్తీ దవాఖానాలు..
కానిస్టేబుళ్లకు ట్రాఫిక్‌లో డ్యూటీ చాలా కష్టమైన పని. ఎండలో చేయడం కూడా చాలా కష్టం. మండుతున్న ఎండలకు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా వారు అనారోగ్యానికి గురవుతారు. ఎండలతో పాటు మరోవైపు కాలుష్యంతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీన్ని అర్థం చేసుకున్న పోలీసు శాఖ కానిస్టేబుళ్ల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోంది. గతంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కూలింగ్ గ్లాసులు అందించిన పోలీసు శాఖ త్వరలో అందరికీ ఈ వినూత్న ఏసీ హెల్మెట్లను అందించనుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఇవి అస్సలు తినకూడదు