గర్భం ధరించిన తర్వాత కొన్ని ఆహారాలు పూర్తిగా నివారించాలి. లేదంటే గర్భశ్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ.

పచ్చి గుడ్లు తింటే కడుపు నొప్పి, వికారం, విరోచనాలకు కారణమవుతాయి.

మొలకెత్తిన పెసలు తినడం మంచిది కాదు. బ్యాక్లీరియాని పెంచుతాయి.

పాశ్చరైజ్‌ చేయని పాలలో లిస్టేరియా, ఇకోలి, సాల్మొనెల్లా ఉంటాయి. ఇవి శిశువుకు హాని కలిగిస్తాయి.

జంతు అవయవ మాంసం విటమిన్‌ బి12, సెలీనియం, రాగి ఉన్నాయి. పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని పెంచుతాయి.

ఆల్కహాల్‌ బిడ్డ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

క్యాట్‌ఫిష్‌, షార్క్‌ వంటి చేపల్లో పాదరసం ఎక్కువ. శిశువు నాది వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.

కోల్డ్‌ కట్‌ మాంసంలో ఉండే బ్యాక్టీరియా గర్భిణీ స్ర్తీలకు సురక్షితం కాదు

పచ్చి బొప్పాయి వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

అందుకే సమతుల్య ఆహారం తిసుకోండి. సురక్షితంగా ఉండండి.