NTV Telugu Site icon

108 Employees: 108 ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాలు పెంచనున్న సర్కార్..

Minister Harish Rao

Minister Harish Rao

108 Employees: 108 ఉద్యోగులకు శుభవార్త అందించిన సర్కార్. 108 ఉద్యోగుల వేతనాలను నాలుగు శ్లాబులుగా పెంచుతున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా కంటే పెద్ద రోగం వచ్చినా రాష్ట్రం మనుగడ సాగిస్తుందని అన్నారు. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో 466 అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలో 466 కొత్త వాహనాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు లక్ష మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని, ఇప్పుడు 75 వేల మందికి ఒక 108 వాహనం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. వాహనాలకు నిధులు అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మఒడిని విడుదల చేశారని వెల్లడించారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

Read also: Hi Nanna: మృణాల్ మరోసారి సీతని గుర్తు చేసింది…

వైద్యారోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. నీతి ఆయోగ్ కూడా తన మంత్రిత్వ శాఖను ప్రశంసించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. కుటుంబ పెద్దకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం రాకముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ఆ విభాగం 70 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు మూతపడ్డాయి. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు అమ్మఒడి వాహనాల ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఆశా వర్కర్ల సెల్‌ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీశ్ తెలిపారు. వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంబులెన్స్‌లను డైనమిక్‌గా ఉంచాలనుకుంటున్నామని వెల్లడించారు. 108 ఉద్యోగుల వేతనాలను నాలుగు శ్లాబులుగా పెంచుతామన్నారు.
Ambulances: 466 అత్యవసర సేవల వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్‌