Anti Dowry Act: బాబోయ్ ఇది నిజమా.. కట్నం తీసుకుంటే కటకటాలకేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti Dowry Act: ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. పెళ్లి విషయానికి వస్తే కట్నం ఎంత అని అడగడం పరిపాటిగా మారింది. కొంతమంది వరులు చాలా గట్టిగా కట్నం డిమాండ్ చేస్తారు. వరుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడంటే చాలు.. భూములు అమ్ముకోవాల్సి వస్తోంది. అంతే.. పెళ్లయిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తే.. తట్టుకోలేక వివాహితలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చిన ఈ వరకట్నం విషయంలో మాత్రం పాత సంప్రదాయాలే కొనసాగుతుండటం బాధాకరం. ఇవ్వగలిగిన వారి పరిస్థితి అలా ఉంచితే.. ఇవ్వలేని వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. వరకట్నాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినా.. వాటిని పాటించే వారు తక్కువే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వరకట్న సంప్రదాయానికి చరమగీతం పాడేలా కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. వరకట్నం విషయంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Read also: Pushpa 2: ఆమె అసలు ‘రష్మిక కాదు ‘ఇషా’
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
వరకట్నం తీసుకునే వరుడి పట్టా రద్దు విధానాన్ని కేరళ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం కేరళలో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేరళలోని వరకట్న వ్యతిరేక విధానాన్ని హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ అధ్యయనం చేశారు. కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో… ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేస్తే… మంచి ఫలితాలు వస్తాయని ఆలోచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదనలు కూడా సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు అవసరమైన ప్రోటోకాల్‌లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఉన్నత విద్యామండలి, మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. వరకట్నం తీసుకుంటే పట్టా రద్దు విధానాన్ని అమల్లోకి తెస్తే ఇలాంటి సంప్రదాయానికి పూర్తిగా స్వస్తి పలకాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
MNJ Hospital: ఆసుపత్రిలోనే పాఠశాలు.. క్యాన్సర్ బాధిత పిల్లలకు సర్కార్ గుడ్ న్యూస్
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!