ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలంగాణ ప్రభుత్వం మరో బాదుడుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్లాట్ల క్రమబద్ధీకరణ త్వరలో జరిగే అవకాశముంది. దీనికి సంబంధించిన కోర్టు తీర్పు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉండడంతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన విలువల ఆధారంగా క్రమబద్ధీకరణ జరపాలని నిర్ణయించారని సమాచారం. సబ్ రిజిస్ట్రార్లు సైతం వారం రోజులుగా ప్రస్తుత మార్కెట్ విలువలకు సంబంధించి నివేదికను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే వెనువెంటనే క్రమబద్ధీకరణను చేపట్టడానికి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించి అన్ని ప్రక్రియలను పూర్తి చేశారు అధికారులు.
Read Also: Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 292 స్కూళ్లు హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్..
ప్రభుత్వానికి అందిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో అనుమతులు లేని లే ఔట్లకు సంబంధించిన ప్లాట్ల క్రమబద్దీకరణ నిమిత్తం వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉండడంతో ఆయా ప్లాట్ల తనిఖీని అధికారుల కమిటీ పూర్తి చేసినట్టుగా తెలిసింది. మొదటి దశలో గ్రామాలు, వార్డులు, సర్వే నంబర్లు, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించిన అధికారుల బృందం దరఖాస్తులతో పాటు ఆయా ప్లాట్లను తనిఖీ చేసినట్టుగా సమాచారం. మరోవైపు 4 ఎల్‌ఆర్‌ఎస్ నిమిత్తం వచ్చిన దరఖాస్తుల్లో నిబంధనలను విరుద్ధంగా ఉన్నా క్రమబద్ధీకరణకు అర్హత లేని సుమారు 2 నుంచి 3 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. అయితే, ప్రభుత్వం తిరస్కరించే దరఖాస్తులకు సంబంధించి రానున్న రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటించనున్నారు.