NTV Telugu Site icon

Ramzan 2022: ముస్లిం సోదరులకు 29న సర్కార్‌ ఇఫ్తార్‌ విందు..

Cm Kcr

Cm Kcr

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం తరపున.. ఈనెల 29వ తేదీన సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నదని వెల్లడించారు కేసీఆర్..

Read Also: Case on SI: యువకుడి ఆత్మహత్య.. ఎస్‌ఐపై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్న సీఎం.. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. అని తెలిపారు సీఎం కేసీఆర్‌.