సోమవారం సాయంత్రం నెలవంక కనిపించిన సందర్భంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ పర్వదిన వేడుకల్ని సంతోషంగా జరుపుకొని, పవిత్ర ప్రార్థనలతో ఆ అల్లాహ్ దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర పండుగ మానవ సేవే చేయాలన్న మంచి సందేశాన్ని మానవాళికి ఇస్తుందని.. ఈ మాసంలో ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనాలు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని అన్నారు. Read Also: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రయోగం వెనక…
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం తరపున.. ఈనెల 29వ తేదీన సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నదని వెల్లడించారు కేసీఆర్.. Read Also: Case on SI: యువకుడి ఆత్మహత్య.. ఎస్‌ఐపై కేసు నమోదు.. తెలంగాణ రాష్ట్రం నేడు…
తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ముస్లింలకు పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెల నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 2 నుంచి మే2 వరకు రంజాన్ ఉపవాసాలు జరుగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ వెలుసుబాటు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.…