NTV Telugu Site icon

COVID 19: ఫోర్త్‌ వేవ్‌ టెన్షన్‌..! తెలంగాణ సర్కార్‌ అలెర్ట్..

Telangana

Telangana

కరోనా థర్డ్‌ వేవ్‌ ముగిసి క్రమంగా తగ్గిపోయిన కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్లు ఇప్పుడు టెన్షన్‌ పెడుతున్నాయి.. మరోవైపు.. ఫోర్త్‌ వేవ్‌ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఆదివారం 1,150 కొత్త కేసులు నమోదై.. నలుగురు మాత్రమే మృతిచెందగా.. ఇవాళ ఆ కేసుల సంఖ్య భారీగా పెరిగి 2,183కు చేరింది.. మరో 214 మంది మృతిచెందారు. నిన్నటి కంటే 90 శాతం కేసులు అధికంగా నమోదు కావడం కలవరపెట్టే అంశం.. దేశ రాజధాని ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. అది ఫోర్త్‌ వేవే అనే హెచ్చరికలు కూడా ఉన్నాయి.. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

Read Also: Narayana Swamy: డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం జగన్‌కు దేవుడి లక్షణాలు..!

ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరిగిపోతున్న సమయంలో అప్రమత్తం అయ్యింది తెలంగాణ వైద్యశాఖ.. మాస్క్ నిబంధనలు మళ్లీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఫోర్త్ వేవ్ తప్పదని వైద్య నిపుణుల హెచ్చరికలు ఉండడంతో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఆంక్షలు పూర్తిస్థాయిలో ఎత్తివేస్తూ వచ్చిన ప్రభుత్వం.. మరోసారి కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. క్రమంగా ఆంక్షల వైపు మళ్లీ అడుగులు వేసే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది.