NTV Telugu Site icon

Warangal: కళ్లు తెరిచిన అమ్మవారు.. వరంగల్ వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు

Warangal

Warangal

Warangal: విగ్రహానికి పాలు తాగడం..శివుడిని పూజిస్తున్న పాము..ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం..ఆంజనేయుడు కళ్లు తెరవడం.. గణపతి కొబ్బరిరూపంలో ఉండటం..రాముడు కన్నీరు కారుస్తున్నట్లు ఉండటం ఇలాంటి విచిత్రమైన సంఘటనలు మనం చూస్తున్నాం.. వింటున్నాం. చాలా మంది భగవంతుడికి మహిమ ఉందని బలంగా నమ్ముతారు. ఇలాంటి సంఘటనలు వారి నమ్మకాలను నిజం చేస్తున్నాయి. దేవుళ్లనే కాదు ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే సంప్రదాయం భారతీయులది. అందుకే రాతిలో కూడా దేవుని ప్రతిమను పూజిస్తారు.

Read also: Vijay Devarakonda: అభిమానులకు విజయ్ దేవరకొండ క్రిస్మస్ కానుక

సాధారణంగా దేవతా విగ్రహాలు మనకు కళ్లు మూసుకుని లేదా సగం తెరిచి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక్కసారిగా అమ్మవారి కన్నులు తెరవడం ఇదంతా అమ్మవారి మహిమ అని చెబుతున్నారు. అమ్మవారి లీలలతో ఇలా జరిగిందని, దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్‌గా మారింది. వరంగల్ నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారు కళ్లు తెరిచి చూడగా అద్భుత దృశ్యం కనిపించిందని భక్తులు అంటున్నారు. అమ్మవారు కుడి కన్ను తెరిచిందన్న ప్రచారం జరగడంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. కనులు తెరిచిన అమ్మవారు దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలిని ఆశీర్వదించడంతో స్థానిక ప్రజలు భక్తి భావంతో ఊగిపోయారు.
Cheryala ZPTC Mallesham: జెడ్పీటీసీ మల్లేశంపై గొడ్డళ్లు కత్తులతో దారుణ హత్య.. వారిపై అనుమానం