Site icon NTV Telugu

Minister KTR: బైక్‌ ఎక్కిన మంత్రి కేటీఆర్‌.. గర్వంగా ఉందంటూ ట్విట్

Ktr

Ktr

Minister KTR: రాష్ట్రం ఈ-వాహనాల హబ్‌గా మారుతుందని, దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం, నిర్వహణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అధునాతన టెక్నాలజీల అభివృద్ధి, వినియోగంలో హైదరాబాద్ దూసుకుపోతుందన్నారు. మాదాపూర్ హైటెక్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ ఎక్స్ పోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీల ప్రమోషన్‌కు తెలంగాణ కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా నిలుస్తోందని వివరించారు.

Read also: Students Protest: రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్‌లో విద్యార్థులు ఆందోళన.. ఉద్రిక్తత

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఉత్పత్తుల తయారీ, పరిశోధన, అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. సెల్ మ్యాన్ తయారీ, సెల్ కాంపోనెంట్ తయారీ, బ్యాటరీ ఎక్స్ఛేంజ్ స్టేషన్లు, టూ వీలర్, త్రీ వీలర్లతో పాటు ఈవీ బస్సులు, లిథియం రిఫైనింగ్ దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందని చెప్పారు. ఎలక్ట్రిక్ రెయిన్‌కోట్‌ల తయారీ, పరిశోధన, అభివృద్ధి సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఈ మోటార్‌షో తొలి ఎడిషన్‌ను హైదరాబాద్‌ ప్రారంభించడం ఎంతో గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఇది దేశంలోనే ప్రత్యేకమైన EV మోటార్ షోలలో ఒకటిగా చెప్పబడుతుందని తెలిపారు కేటీఆర్. ఈసందర్భంగా ఆయన బైక్‌ ఎక్కి పరిశీలించారు.ఈఫోటోలను తన సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో ఈట్వీట్‌ కాస్త ఇప్పుడు వైరల్‌ గా మారింది.
MLA Shankar Nayak: మానుకోట రాళ్ల రుచి రేవంత్ కు తెలియదు నేను సైగ చేస్తే..

Exit mobile version