రాష్ట్రం ఈ-వాహనాల హబ్‌గా మారుతుందని, దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం, నిర్వహణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అధునాతన టెక్నాలజీల అభివృద్ధి, వినియోగంలో హైదరాబాద్ దూసుకుపోతుందన్నారు. మాదాపూర్ హైటెక్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ ఎక్స్ పోను ఆయన ప్రారంభించారు.