సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో 90 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియకువేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను ఆయా శాఖలకు జారీ చేసింది. ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖ ల్లోని 3334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా అడుగులు వేస్తోంది.
Porus Laboratories : కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..