Alert : కాకతీయ వర్సిటీలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
- కాకతీయ వర్సిటీలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
- శాతవాహన వర్సిటీలో బీఎడ్, ఎంఎడ్ పరీక్షలకు వర్షాల ఆటంకం
- మోడల్ స్కూల్స్‌లో 48,630 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
- ఇంటర్, హైస్కూల్ స్థాయిలో వేల సీట్లు ఖాళీగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alert : తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాజేందర్ ప్రకటించారు. వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Vedavyas: సౌత్ కొరియా హీరోయిన్, మంగోలియా విలన్ తో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా
Also Read
- Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
- 1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
అదేవిధంగా, కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టంచేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించినా, ఇంకా సుమారు 48,630 సీట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు.
ఇంటర్ రెండో సంవత్సరం 13,256 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 12,668 సీట్లు, ఆరో తరగతి 7,543 సీట్లు, ఏడో తరగతి 5,192 సీట్లు, ఎనిమిదో తరగతి 3,936 సీట్లు, తొమ్మిదో తరగతి 2,884 సీట్లు, పదో తరగతి 3,151 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నేరుగా సంబంధిత మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌ను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.
Mission Sudarshan Chakra: భారత్‌కు రక్షణ కవచం.. శత్రువులకు చుక్కలే..
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?