Site icon NTV Telugu

Alert : కాకతీయ వర్సిటీలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

Entrance Exam Polycet

Entrance Exam Polycet

Alert : తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాజేందర్ ప్రకటించారు. వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Vedavyas: సౌత్ కొరియా హీరోయిన్, మంగోలియా విలన్ తో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా

అదేవిధంగా, కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్‌, ఎంఎడ్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టంచేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించినా, ఇంకా సుమారు 48,630 సీట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు.

ఇంటర్ రెండో సంవత్సరం 13,256 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 12,668 సీట్లు, ఆరో తరగతి 7,543 సీట్లు, ఏడో తరగతి 5,192 సీట్లు, ఎనిమిదో తరగతి 3,936 సీట్లు, తొమ్మిదో తరగతి 2,884 సీట్లు, పదో తరగతి 3,151 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నేరుగా సంబంధిత మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌ను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.

Mission Sudarshan Chakra: భారత్‌కు రక్షణ కవచం.. శత్రువులకు చుక్కలే..

Exit mobile version