Site icon NTV Telugu

Telangana Elections 2023: బీజేపీ జాబితాలో లేని కిషన్ రెడ్డి, లక్షణ్ పేర్లు.. ఎందుకు..?

Kishan Reddy Lakshman

Kishan Reddy Lakshman

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. త్వరలో నామినేషన్లు వేయనున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. నిన్న బీజేపీ మూడో జాబితాను కూడా విడుదల చేసింది. అయితే, ఈసారి బీజేపీ జాబితాలో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఈసారి బరిలో లేరు. తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు వీరిద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. కె. లక్ష్మణ్ గత 28 ఏళ్లలో బీజేపీ నుంచి ఏడుసార్లు పోటీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గత 24 ఏళ్లలో ఆరుసార్లు పోటీ చేసి మూడుసార్లు గెలిచారు.

ప్రస్తుతం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా, లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మణ్ అప్పుడు ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి టి. మణెమ్మ చేతిలో ఓడిపోయారు. లక్ష్మణ్ వరుసగా 1994, 1999, 2009, 2014, 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేశారు. 1999, 2014లో గెలిచారు.కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి 1999లో కార్వాన్ నుంచి కూడా ఓడిపోయారు.కానీ, మొత్తం ఐదుసార్లు పోటీ చేశారు. మూడుసార్లు గెలిచాడు. 1999లో ఓడిపోయిన ఆయన 2004లో హిమాయత్ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో హిమాయత్ నగర్ రద్దయింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేశారు. గెలిచారు 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి బీజేపీ తన అభ్యర్థుల్లో ఓసీల కంటే బీసీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు కీలక నేతలను రంగంలోకి దించకపోవడం వెనుక వ్యూహం ఏమిటో వేచి చూడాల్సిందే.
Friday : మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికి ఉండాలంటే పొద్దున్నే లేవగానే ఈ పని చెయ్యాల్సిందే..

Exit mobile version