NTV Telugu Site icon

BJP Telangana Manifesto: BJP మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు..!

Bjp Manifesto

Bjp Manifesto

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 13 రోజులే ఉంది. ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీల అభ్యర్థులు.. తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రచారంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన మేనిఫెస్టోను ఇప్పటివరకు బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రేపు నవంబర్‌ 18 అమిత్‌ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోకు ఇంద్రధనుస్సుగా నామకరణం చేశారు. ప్రధానంగా ఏడు అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఈ క్రమంలో బీజేపీ మేనిఫెస్టోని కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయి. అవేంటంటే..

1. ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్
2. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
3. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ
4. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్
5. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత
6. సబ్సిడీ పై విత్తనాలు… వరిపై బోనస్
7. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు.
8. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు
9. మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు
10. ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ
11. బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు
12. ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు
13. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
14. ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటు..
15. PRC పై రివ్యూ… ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి PRC
16. జీఓ 317 పై పునః సమీక్ష
17. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు
18. 5 ఏళ్ల కు లక్ష కోట్ల తో బీసీ అభివృద్ది నిధి
19. రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం
20. తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం..
21. అన్ని పంటలకు పంట భీమా… భీమా సొమ్ము ను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది
22. 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు
23. వృదులకు కాశీ, అయోధ్య లకు ఉచిత ప్రయాణం

Show comments