NTV Telugu Site icon

Dussehra Holidays: దసరా సెలవులపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ.. ఇదే ఫైనల్..

Dussehra Holidays

Dussehra Holidays

తెలుగు రాష్ట్రాల్లో పండగలతో పాటు.. కొన్ని సార్లు సెలవులపై కూడా గందరగోళం ఏర్పడుతోంది.. ఈ పండగా ఫలానా రోజు అంటే.. లేదు.. మరో రోజు జరుపుకోవాలని సూచించిన సందర్భాలు అనేకం.. ఇక, సెలవుల విషయంలోనూ కొన్ని సార్లు ఇలాంటి పరిస్థితి వచ్చింది.. తాజాగా, దసరా సెలవులను కూడా ఇది తాకింది.. దీంతో, అసలు సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి.. ప్రయాణాలకు సిద్ధం కావొచ్చా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి.. ఈ నేపథ్యంలో… దసరా సెలవులపై క్లారిటీ ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ.. సెలవులు కుదిస్తారనే ప్రచారానికి తెరదించుతూ.. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది…

Read Also: SSMB28 : దసరా తర్వాత మహేశ్ రెండో షెడ్యూల్

కాగా, తెలంగాణలో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ పంపించింది… సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులను ప్రకటించింది. పండుగకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కూడా కలిసివస్తుండడంతో.. మొత్తం 15 రోజుల పాటు సెలవులు వచ్చాయి.. అంటే.. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు స్కూళ్లు పూతపడనున్నాయి.. అక్టోబర్‌ 10వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది స్టేట్‌ కౌంసిల్‌ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రేనింగ్ (SCERT).. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కి SCERT డైరెక్టర్ లేఖ రాశారు.. పాఠశాలల దసరా సెలవులు తగ్గించాలని ఆ లేఖలో కోరారు. వర్షాలు, జాతీయ సమైక్యత దినం లాంటి సెలవులతో ఇప్పటికే 7 పని దినాలు పాఠశాలలు నష్టపోయాయని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో దసరా సెలవులు ఈ నెల 26 నుండి కాకుండా అక్టోబర్ 1వ తేదీ నుండి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. లేదా అన్ని రెండో శనివారాలను కూడా వర్కింగ్ డేగా ప్రకటించాలని కోరారు.. దీంతో, అసలు సెలవులు ఎప్పటి నుంచి.. ప్రభుత్వం తగ్గిస్తూ ఏమైనా నిర్ణయం తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో.. గతంలో ప్రకటించిన మాదిరిగానే సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది పాఠశాల విద్యాశాఖ.