తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయబోతున్నారు.. సరిహద్దు దాటి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి రాకుండా.. బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇస్తారు. అయితే, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు లాక్‌డౌన్ తర్వాత కోర్టుకు వచ్చి తీసుకోవాల్సిందే అంటున్నారు పోలీసులు.. సడలింపులు ఉన్న వాహనాలు తప్పితే.. ఉదయం 10 గంటల తర్వాత ఏ వాహనం రోడ్డుపై కనబడినా సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయకు రావొద్దని సూచించిన డీజీపీ.. అనవరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే.. జిల్లా సరిహద్దుల్లో లాక్‌డౌన్ ఆంక్షలు ఉంటాయన్నారు.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. లాక్‌డౌన్ అమలవుతోన్న తీరును పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.