Site icon NTV Telugu

కరోనా థర్డ్‌ వేవ్‌ ఆలోచనే వద్దు..!

CS Somesh Kumar

CS Somesh Kumar

కరోనా మహమ్మారి కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి… సెకండ్‌ వేవ్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. మరోవైపు.. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు మాత్రం ఆందోళన కలగిస్తున్నాయి.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్… కరోనా థర్డ్‌ వేవ్‌ ఆలోచన కూడా రాకూడదన్నారు. థర్డ్‌ వేవ్‌ ముప్పు రాదన్న ఆయన.. అయితే, ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో థర్డ్‌ వేవ్‌ వస్తే.. ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వెల్లడించారు సోమేష్‌ కుమార్.

also read: సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష.. 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు..!

మరోవైపు కరోనా కట్టడి కోసం ఇవాళ్టి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైన్‌ ను చేపట్టింది ప్రభుత్వం.. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను పరిశీలించారు సీఎస్ సోమేష్‌ కుమార్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎస్.. సిటీలోని 4,846 కాలనీల్లో వ్యాక్సిన్‌ తీసుకోని వారి గుర్తిస్తున్నామని.. ప్రతి కాలనీకి సంబంధించిన షెడ్యూల్‌ తయారు చేశామని తెలిపారు. ఇక, వ్యాక్సినేషన్‌ పూర్తయిన ఇంటికి నీలి రంగు స్టిక్కర్‌ అతికిస్తున్నామన్న ఆయన.. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వల్ల చాలా మంది టీకా వేయించుకోవాడికి వస్తున్నట్టు తెలిపారు.

Exit mobile version