Site icon NTV Telugu

Tummala Nageswara Rao : 2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

Minister Tummala

Minister Tummala

Tummala Nageswara Rao : తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం, మొత్తం 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ విషయం పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అందిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 28 జిల్లాల 270 మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. సుమారు 1,43,304 మంది రైతులు ప్రభావితమయ్యారని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా వరి పంట ఎక్కువగా దెబ్బతింది. మొత్తం 2,463 గ్రామాల్లో 1,09,626 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది.

Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో సె*క్స్ చేయొచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే!

అదే విధంగా పత్తి 60,080 ఎకరాల్లో, మొక్కజొన్న 16,036 ఎకరాల్లో, మిర్చి 194 ఎకరాల్లో నష్టపోయాయి. కంది 6,751 ఎకరాల్లో, జొన్న 15 ఎకరాల్లో, పల్లి 116 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. సోయాబీన్ పంటలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మొత్తం 20,983 ఎకరాల్లో సోయాబీన్ పంటలు దెబ్బతిన్నాయి. ఇక హార్టికల్చర్ పంటలు 639 ఎకరాల్లో, ఇసుక మెటల వల్ల 6,003 ఎకరాల్లో పంటలు నష్టపోయాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ భారీ పంట నష్టంపై ప్రభుత్వం త్వరలోనే తదుపరి చర్యలు చేపట్టనుంది.

Mayookham: 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో తొలి ఇండియన్ సినిమా “మయూఖం

Exit mobile version