తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గాయి.. కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,803 శాంపిల్స్ పరీక్షించగా.. 2,098 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,76,313కు చేరింది.. ఒకే రోజు 3,801 రికవరీ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,42,988కు పెరిగింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో… మృతుల సంఖ్య 4,099కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 29,226 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.
Read Also: ఒవైసీని చంపాలనే కాల్పులు.. అందుకే లేపేయాలనుకున్నా..!
