Site icon NTV Telugu

తెలంగాణ‌లో ఈ రోజు ఎన్ని కోవిడ్ కేసులంటే..

తెలంగాణ‌లో కొత్త‌గా 2,646 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 88,206 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా 2,646 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే స‌మ‌యంలో 3,603 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.. దీంతో.. తెలంగాణ ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407కు చేరుకోగా.. రిక‌వ‌రీ కేసుల సంఖ్య 7,30,648కు పెరిగింది.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 4,094కు చేరుకుఇంది.. ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34,665 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో వెల్ల‌డించింది స‌ర్కార్.

Read Also: డ్ర‌గ్స్ కేసులో కీల‌క మ‌లుపు.. పోలీసుల అదుపులో టోనీ ప్రధాన అనుచరుడు..

Exit mobile version