యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగతూ వస్తున్నాయి. దీనికి తోడు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు కూడా పంజా విసురుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో.. ఇప్పటికే భారీగా ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27, 249మందికి కరోనా టెస్టులు చేయగా.. 562 మందికి కరోనా సోకినట్లు నిర్థాణైంది.
అంతేకాకుండా.. ఒక్క రోజులు కరోనా నుంచి 616 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం తెలంగాణలో 8,07,134 మందికి కరోనా సోకగా.. అందులో.. 7,97,911 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 4,111 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,112 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
