Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Congress Party Chalo Rajbhavan Tension Hyderabad

Congress Chalo Rajbhavan: రణరంగంగా ఖైరతాబాద్‌..

Published Date :June 16, 2022 , 2:39 pm
By NTV WebDesk
Congress Chalo Rajbhavan: రణరంగంగా ఖైరతాబాద్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాహుల్‌ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన నిర‌స‌న, ఆందోళనలు,, ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఖైరతాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లారు. దీంతో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాంగ్రెస్‌ తలపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు రేణుకాచౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్‌ పట్టుకున్నారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ జోయల్ డేవిస్ భ‌ట్టి విక్ర‌మార్క‌ను ముందుకు తోయడంతో సీరియ‌స్ అయిన భ‌ట్టి ఆయ‌న‌పై మండిప‌డ్డారు. దీంతో భ‌ట్టి విక్రామర్క‌పై ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.

రేవంత్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో కాంగ్రెస్‌ చేపట్టిన చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్ల దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

రాజ్‌భవన్‌కు వెళ్లే ఇరువైపులా రోడ్లను మూసివేయడంతో ఖైరతాబాద్‌ జంక్షన్‌లో భారీ ట్రాఫిక్‌ జాం అయింది. ఖైరతాబాద్‌-పంజాగుట్ట రూట్‌లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బేగంపేట మార్గంలోనూ ట్రాఫిక్‌ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను రాజ్‌భవన్‌ రూట్‌లోకి అనుమతించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Harish Rao: గ్రూప్ 4 ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. జూన్ నెల‌లోనే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhatti Vikramarka Mallu
  • Chalo RajBhavan
  • Congress Party
  • hyderabad
  • Renuka Chowdhury

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions