Site icon NTV Telugu

Telangana: కాంగ్రెస్‌ ఆందోళన బాట.. నేతల ముందస్తు అరెస్ట్‌లు..

Congress

Congress

కాంగ్రెస్‌ పార్టీ పోరు బాట పడుతోంది.. తెలంగాణలో పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపు నిచ్చింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టదించాలని నిర్ణయించింది. ఉదయం 10.30 నిమిషాలకు పార్టీ నాయకులు అంతా ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేరుకోనున్నారు. అక్కడి నుండి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్తారు. పార్టీ ముఖ్య నాయకులు అంతా ఈ ముట్టడిలో పాల్గొనాలని పీసీసీ ఆదేశించింది. జిల్లాల వారిగా కూడా నాయకులను తరలించాలని సూచించింది. పార్టీ ముఖ్య నాయకులతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూమ్ లో సమావేశం అయ్యారు. విద్యుత్ సౌధ ముట్టడిని సక్సెస్ చేయాలని కోరారు.

Read Also: Governor Delhi Tour: హస్తినలో సంచనల వ్యాఖ్యలు.. హీట్ పెంచిన తమిళిసై ఢిల్లీ టూర్..

విద్యుత్ చార్జీలతో పాటు… నిత్యావసర వస్తువుల ధర ల పెరుగుదలపై కూడా నిరసనకు పిలుపు నిచ్చింది. కేంద్రం పెంచుతూ పోతున్న ధరలకు నిరసనగా సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చింది. పార్టీ లో అనుబంధ సంఘాలు… కిసాన్ కాంగ్రెస్ నేతలు సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యాలయం ముట్టడిలో పాల్గొనాలని నిర్ణయించారు. అటు విద్యుత్ ఛార్జీలు…ఇటు నిత్యావసర…పెట్రో దలకు నిరసనగా ఆందోళన ఉదృతం చేయాలని పార్టీ భావిస్తోంది. పెరిగిన ధరలు పేదల మీద భారం మోపకుండా ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. పెట్రో ధరలపై కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న టాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్. అయితే, రాత్రి నుంచే కాంగ్రెస్‌ నేతల గృహ నిర్భందాలు, ముందస్తు అరెస్ట్‌లు జరుగుతున్నాయి.. పార్టీ ముఖ్య నాయకులను హౌస్‌ రెస్ట్‌ చేశారు పోలీసులు.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, దాసోజు శ్రవణ్‌ సహా పలువరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

Exit mobile version