Site icon NTV Telugu

నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

Revanth Reddy

Revanth Reddy

నిరుద్యోగ సమస్య పై ఆందోళన బాట పట్టాలని టి-కాంగ్రెస్ నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు సిద్దమైంది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే అక్టోబర్ 2 నుండి.. డిసెంబర్ 9 వరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీలకు అతీతంగా… నిరుద్యోగ సైరన్ కి మద్దతు పలకాలని అప్పీల్‌ చేస్తోంది పీసీసీ. అక్టోబర్ 2న దిల్‌సుఖ్‌నగర్‌ నుండి.. ఎల్బీ నగర్‌లో శ్రీకాంత చారి ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం వరకు ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకుంది పార్టీ. వచ్చేనెల 2న నిరసనలు ప్రారంభించి.. డిసెంబర్ 9న రాహుల్ గాంధీ సభతో నిరుద్యోగ సైరన్ ముగించాలని చూస్తుంది టి-కాంగ్రెస్‌. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్ధి ఎంపికపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని ప్రకటించారు రేవంత్.

Exit mobile version