NTV Telugu Site icon

CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం రేవంత్ రెడ్డి తన మనవడు శ్రీనుకి తలనీలాలు చెల్లించుకున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన రేవంత్‌ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Read also: Janvikapoor : శారీలో జాన్వీ ఎంత అందంగా ఉందో చూశారా..

తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రచనా అతిధిగృహం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తన మనవడి పుట్టెంట్రుకులు స్వామి వారికి రేవంత్ కుటుంబ సభ్యులు సమర్పించారు. రాత్రికి తిరుమలలో రేవంత్ రెడ్డి బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా బాలాజీని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం ఇవాళ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్.
Kaleshwaram: కాళేశ్వరం పై అన్ని వివరాలివ్వండి..