CM Revanth Reddy: పెట్టుబడులకు అవకాశం ఉంది..13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌లో 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. ఈ విందుకు అమెరికా, ఇరాన్, టర్కీ, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి స్వాగతం పలికి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం ‘అభయహస్తం’తో అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సమానత్వం, పారదర్శకతతో పనిచేస్తోందని వెల్లడించారు.
Read also: OIL Recruitment 2024: ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Also Read
ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. యువత భవిష్యత్తు, పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ఆయా దేశాలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని సీఎం కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిణి స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
OIL Recruitment 2024: ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
-
Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
-
Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!