NTV Telugu Site icon

Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణపై చర్చ..?

Revanth Reddy Delhi Tour Tomorrow

Revanth Reddy Delhi Tour Tomorrow

Revanth Reddy: రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ హైకమాండ్ అనుమతితోనే కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19న (మంగళవారం) సీఎం రేవంత్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో నియామకాలపై పార్టీలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కోసం పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా హైకమాండ్ తో చర్చించనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పదవుల పంపకం జరగనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కూడా ఓ క్లారిటీ రానుంది.

Read also: Bigg Boss7 Telugu : రన్నర్ గా అమర్ ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా? ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించింది. మరో ఆరు ఖాళీల భర్తీకి మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పేర్లపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అయితే కేబినెట్‌ను ఎప్పుడు విస్తరిస్తారనే దానిపై స్పష్టత లేదు. కానీ మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులెవరూ గెలుపొందనప్పటికీ, నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్‌ఖాన్‌ మైనారిటీ కోటాలో పోటీ చేస్తున్నారు. అదే కోటా కోసం నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓడిపోయిన షబ్బీర్ అలీ కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఆయనను మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Read also: Bigg Boss7 Telugu : రన్నర్ గా అమర్ ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా? ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే..

అలాగే..అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వీరికి మంత్రులుగా అవకాశం కల్పించి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసిన విషయం తెలిసిందే… మొదటి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు.. కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్‌లో ఉంచారు. ఇందులో హోం శాఖతోపాటు విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మిగిలిన ఆరు స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నారని సమాచారం.
LIC Credit Card : ఎల్ఐసీ క్రెడిట్ కార్డు.. ఈ కార్డు బెనిఫిట్స్ ఏంటో తెలుసా?