సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుందామని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయినట్లు సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Read Also: సుదీర్ఘంగా తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
Also Read
సీఎం కేసీఆర్ బదులుగా మంత్రుల బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి, వ్యవసాయశాఖ ఫీల్డ్ అధికారులు వరంగల్ జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకుంటారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వీరు వడగళ్ల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందించనున్నారు. కాగా వడగళ్ల వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రూ.960 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలోని 18 మండలాల్లోని మిరప, మొక్కజొన్న, బొప్పాయి, కూరగాయలు, కంది పంటలకు 100 శాతం నష్టం వాటిల్లినట్లు వారు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?