NTV Telugu Site icon

ఈ నెల 10న ఉమ్మ‌డి నిజామాబాద్‌లో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

KCR

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ నెల 10వ తేదీన కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీస్ కార్యాల‌ను ప్రారంభించ‌నున్నారు.. ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని భవనాలను సిద్ధంగా ఉంచాలని ఇప్ప‌టికే సంబంధిత అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.. కామారెడ్డి పట్టణ శివారులోని నూతన కలెక్టరేట్‌, పోలీసు భవనాల నిర్మాణ పనులను 2017లో అప్పటి రెవెన్యూశాఖ మంత్రి మహ్మద్‌అలీ ప్రారంభించ‌గా.. సుమారు 30 ఎకరాలలో రూ.66 కోట్ల నిధులతో నిర్మాణ పనులు జ‌రిగాయి.. ఇప్పటికే కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంతో పాటు అదనపు కలెక్టరేట్‌ల కార్యాలయాలు ప్రారంభించడం అక్కడ నుంచే కలెక్టర్‌ పాలన కొన‌సాగించ‌నున్నారు.

ఇక‌, కలెక్టరేట్‌ ఎదుట బీటీ రోడ్డు, పార్కింగ్‌కు, గార్డెన్‌ స్థలాల పనులను పూర్తి కాగా.. మొత్తం 95శాతం పనులు పూర్తి కావ‌చ్చాయి.. కేవలం భవనాన్ని ప్రారంభించాల్సిఉంద‌ని.. భవనాన్ని ప్రారంభించగానే కలెక్టరేట్‌ను ఆయా శాఖలను నూతన భవనంలోకి త‌ర‌లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రోవైపు.. కలెక్టరేట్‌ భవన సమీపంలోనే నూతన పోలీసు భవన నిర్మాణాన్ని రూ.15 కోట్లతో వైట్‌ హౌజ్‌ను తలపించే విధంగా నిర్మించారు.. 10వ తేదీన ఉదయం 11 గంటలకు కామారెడ్డిలోని నూతన సమీకృత భవనాలను ప్రారంభించ‌నున్నారు సీఎం కేసీఆర్.. మ‌రోవైపు.. నిజమాబాద్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.