Sankranti Wishes: సంక్రాంతి పండుగ సంతోషం నింపాలి.. రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నేతలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగగా మారిన రోజున భారతదేశం సంపూర్ణంగా విప్లవాత్మకంగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని రైతులకు, ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. పొలాల్లోని ధాన్యాలు తమ ఇళ్లకు చేరే శుభసందర్భంగా సంబురమనే సంక్రాంతి పండుగను జరుపుకుంటామని, తనను నమ్ముకున్న రైతు భూమి మాతకు కృతజ్ఞతలు తెలిపే రోజు సంక్రాంతి పండుగ అని సీఎం వివరించారు.
CM Sri KCR extended festive greetings to the farmers and people of Telangana and other States of India on the occasion of #Bhogi, #MakarSankranti and #Kanuma. pic.twitter.com/TlBQozup1V
Also Read
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
— Telangana CMO (@TelanganaCMO) January 14, 2023
మంత్రి కేటీఆర్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
ఈ సంబరాల సంక్రాంతి మీ అందరి జీవితాలలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ…
మకర సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/IxIbIGqTzt
— KTR (@KTRTRS) January 14, 2023
Read also: Narendra Modi: మారుతున్న దేశ భవిష్యత్తుకు వందేభారత్ ఒక ఉదాహరణ
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో జరిగే ఈ పండుగ అందరిలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. పంట చేతికొచ్చే సమయంలో జరిగే ఈ పండుగ అందరిలో ఆనందాన్ని నింపుతుందని అన్నారు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి పండుగను చిన్నారులందరూ నూతన వస్త్రాలతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
#Pongal celebrations on 15th Jan 2023 Sunday 7 30am at #Rajbhavan #Hyderabad with Rajbhavan parivar pic.twitter.com/kStisbJ3Uz
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 14, 2023
సంక్రాంతి విశ్వమంగళ దినమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు కావస్తున్నా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల బతుకుల్లో మార్పు రాలేదన్నారు.
హిందూ బంధువులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.#MakaraSankranti #Sankranti pic.twitter.com/7zK2i11Rxc
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 15, 2023
Read also: BRS Flexi in AP: ఏపీలో భారీగా కేసీఆర్, కేటీఆర్ ఫెక్సీలు.. సంక్రాంతి బరిలో బీఆర్ఎస్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతి ఇంటా…
భోగభాగ్యాల భోగి…
సిరి సంపదలసంక్రాంతి…
పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ…
శుభాకాంక్షలు.#Bhogi2023 pic.twitter.com/IevLWS8Z1g— Revanth Reddy (@revanth_anumula) January 14, 2023
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?