NTV Telugu Site icon

Sankranti Wishes: సంక్రాంతి పండుగ సంతోషం నింపాలి.. రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు

Ktr Abndisanjay Revanthreddy

Ktr Abndisanjay Revanthreddy

Sankranti Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నేతలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగగా మారిన రోజున భారతదేశం సంపూర్ణంగా విప్లవాత్మకంగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని రైతులకు, ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. పొలాల్లోని ధాన్యాలు తమ ఇళ్లకు చేరే శుభసందర్భంగా సంబురమనే సంక్రాంతి పండుగను జరుపుకుంటామని, తనను నమ్ముకున్న రైతు భూమి మాతకు కృతజ్ఞతలు తెలిపే రోజు సంక్రాంతి పండుగ అని సీఎం వివరించారు.

మంత్రి కేటీఆర్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

Read also: Narendra Modi: మారుతున్న దేశ భవిష్యత్తుకు వందేభారత్ ఒక ఉదాహరణ

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో జరిగే ఈ పండుగ అందరిలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. పంట చేతికొచ్చే సమయంలో జరిగే ఈ పండుగ అందరిలో ఆనందాన్ని నింపుతుందని అన్నారు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతి పండుగను చిన్నారులందరూ నూతన వస్త్రాలతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

సంక్రాంతి విశ్వమంగళ దినమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లు కావస్తున్నా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల బతుకుల్లో మార్పు రాలేదన్నారు.

Read also: BRS Flexi in AP: ఏపీలో భారీగా కేసీఆర్‌, కేటీఆర్‌ ఫెక్సీలు.. సంక్రాంతి బరిలో బీఆర్‌ఎస్‌

తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Show comments