కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న సమయంలో.. కేంద్ర మంద్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరు రోజులుగా హస్తినలో మకాం వేసిన ప్రధాని మోడీ, అమిత్‌షా.. మరికొందరు కేంద్ర మంత్రులను కలుస్తున్న యాన.. ఇవాళ జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు.. కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఈ సందర్భంగా గజేంద్ర షెకావత్ కు హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే ఉపసంహరణ దరఖాస్తును దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం… ఇక, కృష్ణా, గోదావరి నదీ నిర్వహణ బోర్డుల నిర్వహణకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సమయం కావాలని అడిగిన సీఎం కేసీఆర్.. అప్పటివరకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.. ఈ భేటీలో కృష్ణా నదీ, గోదావరి పరివాహక ప్రాంతాలలోని ప్రాజెక్టుల వారీగా కేంద్రమంత్రికి వివరించారు తెలంగాణ సీఎం.
కేంద్రమంత్రి షెకావత్‌తో కేసీఆర్ భేటీ.. అప్పటి వరకు సహకరిస్తామని హామీ
