Site icon NTV Telugu

Agnipath Scheme: రాకేష్ ఫ్యామిలీకి కేసీఆర్ భరోసా.. ఎక్స్ గ్రేషియా, ప్ర‌భుత్వ ఉద్యోగం

Kcr

Kcr

అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో .. రైల్వే పోలీస్ కాల్పుల్లో, వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్ర‌వేశ‌పెట్టిన‌ అగ్నిపథ్ పథకం ఓ యువకుడి ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు విమర్శించారు.

కేంద్రం త‌ప్పుడు విధానాల‌వ‌ల్లే రాకేష్ బ‌ల‌య్యాడ‌ని మండిప‌డ్డారు. రాకేష్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. కుటుంబంలో అర్హులైన వారికి వారి ఆర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని సీఎం విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.

వ‌రంగ‌ల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర రాకేశ్‌..రెండుసార్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడు. చిన్న కార‌ణం వ‌ల్ల ఉద్యోగం కోల్పోయాడు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాడు. ఇటీవలే ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నాడు. అయితే అగ్నిపథ్ స్కీం ద్వారానే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని తెలియగానే తీవ్ర మనస్తాపానికి గుర‌య్యాడు. హన్మకొండకు చెందిన మరో 14 మందితో కలిసి నిర‌స‌న తెలిపేందుకు హైద‌రాబాద్‌కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆర్పీఎఫ్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పాయాడు.

త‌మ కొడుకు రాకేశ్‌ గత కొన్నేళ్లుగా హన్మకొండలో ఆర్మీ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నాడ‌ని త‌ల్లిదండ్రులు తెలిపారు. అగ్నిప‌థ్ వ‌ల్ల త‌న భ‌విష్య‌త్ పాడైపోతుంద‌ని మ‌న‌స్తాపం చెందాడ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. నిర‌స‌న తెలిపేందుకు హైద‌రాబాద్ వ‌చ్చాడ‌ని చెప్పారు. త‌మ పెద్ద‌కొడుకు దివ్యాంగుడ‌ని తెలిపారు. కుటుంబానికి ఆస‌రాగా ఉంటాడనుకున్న చిన్న కొడుకు కాల్పుల్లో మ‌ర‌ణించ‌డంతో ఆ త‌ల్లిదండ్రులు గుండెలు ప‌గిలేలా సేలా రోదించారు.

Navy Chief: అగ్నిపథ్‌.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌

Exit mobile version