NTV Telugu Site icon

కాంగ్రెస్‌ను తీసిపారేసిన కేసీఆర్.. అదొక పార్టీనా..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఫోకస్‌ మొత్తం ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై పెట్టినట్టుగా కనిపిస్తోంది.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర నేతలను టార్గెట్‌ చేస్తూనే.. కేంద్రం విధానాలను తప్పుబట్టిన కేసీఆర్.. ఇవాళ రెండో రోజు కూడా.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.. అయితే, ఇదే సమయంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని కాస్త లైట్‌గా తీసుకుంటున్నారు కేసీఆర్.. ఇవాళ ప్రగతిభవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్‌ పార్టీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ అదొక ఒక పార్టీనా ? అంటూ ప్రశ్నించారు.. గాంధీని తిడితే కూడా దిక్కులేదు.. పోరాడాల్సిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేస్తుంది? అంటూ నిలదీసిన ఆయన.. తెలంగాణలో మాకు ప్రత్యామ్నాయం మరొకటి లేదంటూ స్పష్టం చేశారు. ఇక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు 16వ తేదీ వరకు సమయం ఉందని.. అప్పటిలోగా అభ్యర్థులను ఎంపిక జరుగుతుందన్నారు కేసీఆర్. అయితే, బీజేపీ నేతలను టార్గెట్‌ చేస్తూ.. రాష్ట్ర నేతల నుంచి కేంద్రం పెద్దలకు ఎవరినీ వదలని ఆయన.. కాంగ్రెస్‌ పార్టీని మాత్రం లైట్‌ తీసుకోవడం చర్చగా మారింది.