Ponnam Prabhakar : అందుకే.. చెక్ పోస్టులు మూసివేశాం..
- చెక్కు పోస్టుల రద్దుతో రవాణా వ్యవస్థలో నూతన దశ
- ఈవీ పాలసీతో పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ
- రోడ్ సేఫ్టీ అవగాహనకు ప్రత్యేక చర్యలు
- రవాణా శాఖలో పారదర్శకత, బ్రోకర్ వ్యవస్థపై కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెక్ పోస్టులను రద్దు చేస్తూ జీవో జారీ చేసినట్లు ప్రకటించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఆన్లైన్లో జరగాలనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుని, ఈరోజు నుండి చెక్ పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామని తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునికత, పారదర్శకతను తీసుకురావడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వాహన్ అమలు కొనసాగిస్తోందని, త్వరలోనే సారథి సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రవాణా శాఖలో కృత్రిమ మేధ (AI) టెక్నాలజీని వినియోగిస్తూ పారదర్శక వ్యవస్థను నెలకొల్పుతున్నామని చెప్పారు. కార్యాలయాల్లో రెగ్యులర్‌గా వచ్చే దరఖాస్తుదారుల వివరాలు స్వయంచాలకంగా రికార్డ్ అవుతూ, హెడ్ ఆఫీస్‌కు అలర్ట్‌లు పంపే విధంగా సిస్టమ్ అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో వాహనాలకు సంబంధించిన రికార్డులు, టాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ వంటి అంశాలను ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించే చర్యలు తీసుకున్నామని వివరించారు.
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్) పాలసీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.577 కోట్ల ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. ఇవి వాహనాల అమ్మకాల వాటా 0.03 శాతం నుండి 1.13 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. ఢిల్లీలో లాగా కాలుష్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా తెలంగాణ ఇవి పాలసీని రూపొందించిందని వివరించారు. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు, LPG, CNG ఆటోలకు 10 వేల చొప్పున, అలాగే 25 వేల రిట్రోఫిటింగ్ ఆటోలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. పాత వాహనాల స్థానంలో ఇవి వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఆధునిక రవాణా వాతావరణాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు.
రోడ్ సేఫ్టీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ పలు కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి వివరించారు. నాచారం, కరీంనగర్‌లలో రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కాలేజీల్లో రోడ్ సేఫ్టీ క్లబ్బులు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను తీసుకువచ్చే ప్రణాళిక ఉందని తెలిపారు.
గత 10 సంవత్సరాల్లో రవాణా శాఖలో అవినీతి మూలాల్లా ఏర్పడిందని విమర్శించిన మంత్రి, ఇప్పుడు పారదర్శక వ్యవస్థను తీసుకువస్తున్నామని తెలిపారు. బ్రోకర్ వ్యవస్థను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 63 కేంద్రాల్లో కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. 112 మంది AMVI లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోలీస్, ఆర్టీసీతో పాటు ఇతర శాఖల్లో ఉన్న పాత వాహనాలను స్క్రాప్‌కి పంపించాలని ఆదేశించామని వివరించారు.
చెక్ పోస్టులను రద్దు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కేబినెట్లో ఆమోదం పొందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాబోయే కాలంలో మొత్తం ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా సేకరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.7 కోట్ల వాహనాలు ఉన్నాయని, రోడ్ ప్రమాదాలు తగ్గించేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరించారు. వాహన్, సారథి సిస్టమ్‌ల ద్వారా తెలంగాణ కూడా దేశంలోని మిగిలిన 28 రాష్ట్రాలతో సమానంగా సాంకేతికతలో ముందంజ వేస్తుందని తెలిపారు.
“గత పదేళ్లలో తెలంగాణ వాహన్, సారథి ప్లాట్‌ఫారమ్‌లలో ఎందుకు చేరలేదో తెలియదు. ఇప్పుడు మేము చేరాం, డేటా ట్రాన్స్ఫర్మింగ్ జరుగుతోంది. వాహన్ ఇప్పటికే అమల్లో ఉంది, సారథిని త్వరలో అమలు చేస్తాం. ఇకపై రవాణా శాఖలో అవినీతి లేదా అనధికార వ్యవహారాలకు చోటు ఉండదు,” అని మంత్రి స్పష్టం చేశారు. చెక్ పోస్టుల రద్దు వల్ల అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ను మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?