Site icon NTV Telugu

Kendriya Vidyalaya : పండుగవేళ తెలంగాణకు కేంద్రం శుభవార్త

Kendriya Vidyalaya

Kendriya Vidyalaya

Kendriya Vidyalaya : తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా సమగ్ర మద్దతు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణలో స్థాపించేందుకు కేటాయించినట్లు ప్రకటించబడింది. ఇప్పటికే రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త నాలుగు విద్యాలయాలు మరమ్మూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్య అందించడంలో కీలక పాత్ర వహించనున్నాయి.

తెలంగాణకు మంజూరైన నాలుగు కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, జగిత్యాల రూరల్ మండలం చెల్గల్, వనపర్తి జిల్లా నాగవరం శివార్ లో కేంద్రం కలిగి ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా వంటి ప్రాంతాలు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌లు, గిరిజన ప్రాంతాలు కావడంతో, ఇక్కడ ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయాలు విద్యను సమానంగా అందించే దిశగా కీలకం అవుతాయి.

ఇవి కాకుండా, గత రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యకు రూ.400 కోట్లతో 794 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసింది. పీఎం-శ్రీ స్కూల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. సమగ్ర శిక్షా అభియాన్ కింద కూడా ఈ రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి దాదాపు రూ.2 వేల కోట్లను కేటాయించింది.

అంతే కాక, ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం స్థానిక ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉన్నత విద్యా అవకాశాలను సమానంగా అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది.

మొత్తంగా, కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రీయ విద్యా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా రంగంలో నాణ్యత, సమగ్రతను పెంచే దిశగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

Exit mobile version