Kendriya Vidyalaya : పండుగవేళ తెలంగాణకు కేంద్రం శుభవార్త
- కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు
- తెలంగాణకు మంజూరైన నాలుగు కొత్త విశ్వవిద్యాలయాలు
- పీఎం-శ్రీ స్కూల్స్, ట్రైబల్ యూనివర్సిటీ , నిధుల కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kendriya Vidyalaya : తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా సమగ్ర మద్దతు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణలో స్థాపించేందుకు కేటాయించినట్లు ప్రకటించబడింది. ఇప్పటికే రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త నాలుగు విద్యాలయాలు మరమ్మూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్య అందించడంలో కీలక పాత్ర వహించనున్నాయి.
తెలంగాణకు మంజూరైన నాలుగు కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, జగిత్యాల రూరల్ మండలం చెల్గల్, వనపర్తి జిల్లా నాగవరం శివార్ లో కేంద్రం కలిగి ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా వంటి ప్రాంతాలు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లు, గిరిజన ప్రాంతాలు కావడంతో, ఇక్కడ ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయాలు విద్యను సమానంగా అందించే దిశగా కీలకం అవుతాయి.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ఇవి కాకుండా, గత రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యకు రూ.400 కోట్లతో 794 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసింది. పీఎం-శ్రీ స్కూల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. సమగ్ర శిక్షా అభియాన్ కింద కూడా ఈ రెండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి దాదాపు రూ.2 వేల కోట్లను కేటాయించింది.
అంతే కాక, ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం స్థానిక ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉన్నత విద్యా అవకాశాలను సమానంగా అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది.
మొత్తంగా, కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రీయ విద్యా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా రంగంలో నాణ్యత, సమగ్రతను పెంచే దిశగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!