Site icon NTV Telugu

CM Revanth Reddy : ఇది కేవలం డేటా కాదు.. ఇది తెలంగాణ మెగా హెల్త్‌ చెకప్‌

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలో చేపట్టిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని, ఇది తెలంగాణకు ఒక మెగా హెల్త్ చెకప్‌లాంటిదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం సాధనలో ఈ కులగణన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. కులగణనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ, 300 పేజీల నివేదికను సిద్ధం చేసి ఎంసీహెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలసి సమర్పించింది.

Murder : భార్యను చంపి అడవిలో పడేసిన భర్త!

వివిధ కులాల వెనుకబాటుతనాన్ని విశ్లేషించిన ఈ నివేదికలో, ప్రస్తుత విధానాలను మెరుగుపరచడం తో పాటు కొత్త పాలసీలకు సంబంధించిన సూచనలు ఉన్నాయి. కమిటీ సూచనలపై కేబినెట్ సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వెనుకబాటుతన తేడాలను లోతుగా పరిశీలించి, వాటి కారణాలను విశ్లేషించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా సమగ్ర చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ నిర్వహించిన ఈ సర్వే చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుని, దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Viral News: ఒకే అమ్మాయిని వివాహం చేసుకున్న ఇద్దరు అన్నదమ్ములు..

Exit mobile version