Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె , వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు కీలక విన్నపం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన స్పష్టం చేశారు.
చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం..
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని సీఎం భరోసా ఇచ్చారు. ‘మీ కుటుంబాలను అన్యాయం చేయకండి. రేపు డిప్యూటీ సీఎం కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు’ అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, సానుకూల వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయం..
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల క్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని హామీ ఇచ్చారు.
క్షమించరాని ప్రాణత్యాగాలు..
కార్మికులు ప్రాణాలు తీసుకోవాలనుకోవడం అత్యంత బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. క్యాబినెట్‌లో ఈ విషయంపై తీవ్రంగా చర్చించామని, కార్మికులు తమ కుటుంబాల గురించి ఆలోచించాలని కోరారు. కార్మిక సంఘాలు చర్చలకు ముందుకు వచ్చి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు, కార్మికుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా క్యాబినెట్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!