Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఈనెల 21న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ
- శాఖలకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ
- ఎజెండా అంశాలు మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలి
- అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు , కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను, వాటి పక్కా తెలుగు అనువాదంతో కలిపి మంగళవారం సాయంత్రం 6 గంటల లోపు తప్పనిసరిగా సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు పంపాలని సీఎస్ స్పష్టం చేశారు. ఒకవేళ ఏ శాఖకైనా కేబినెట్ చర్చ పరిధిలోకి వచ్చే ఎజెండా అంశాలు లేకపోయినా.. ఆ వివరాలతో కూడిన ‘నిల్’ (NIL) నివేదికను కూడా నిర్దేశిత గడువులోగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేబినెట్ సమావేశం జరిగే సమయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు , ప్రభుత్వ కార్యదర్శులందరూ ఏ ఒక్కరూ సెలవు పెట్టకుండా తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్ (కార్యాలయాల) లోనే అందుబాటులో ఉండాలని సీఎస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!