తెలంగాణలో కఠిన ఆంక్షలు..? కీలక భేటీకి సిద్ధమైన కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో.. కేబినెట్ సమావేశం నిర్వహించడానికి సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
Read Also: బ్రేకింగ్: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
దేశంలో, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే విద్యా సంస్థల సెలవులు పొడిగించిన నేపథ్యం ఓవైపు.. కోవిడ్ కట్టడికి ఇతర రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తోన్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? మళ్లీ లాక్‌డౌన్ పెడతారా? లేక నైట్ కర్ఫ్యూ విధిస్తారా? లేదా.. మరో విధంగా ఆంక్షలు పెడతారా? సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి? పబ్లిక్ ప్లేస్‌లలో ఎలాంటి ఆంక్షలు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. విద్యా సంస్థలకు సెలవులు 30వ తేదీ వరకు పొడిగించినా.. ఈ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయా? లేదా? అనేది కూడా రేపటి కేబినెట్ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!